Tuesday, August 10, 2010

సైకో అనాలిసిస్ - 1

సంభాషణ - రాసిన ఒక సంవత్సరం తరవాత పోస్ట్ చేస్తున్నా

రవి: నువ్వు ఒక విషయం గురించి కావలసిన దాని కంటే ఎక్కువగా ఆలోచిస్తుంటావు. మిగతా వాళ్ళు వంద రకాలుగా ఆలోచిస్తే నువ్వు unlimited గా ఆలోచిస్తూ ఉండిపోతావు. మామూలు మనుషులు పది పర్సెంట్ బ్రెయిన్ వాడితే ఒక మూవీ డైరెక్టర్ కాని సైంటిస్ట్ కాని ఇలా ఏదైనా సాధించిన వాళ్ళు 25% బ్రెయిన్ వాడతారు. నువ్వు ఏమీ సాధించకుండానే అనవసరంగా బ్రెయిన్ వాడుతున్నావు. నీ లైఫ్ partner కి కూడా ఇదే అనుమానం ఏదో ఒక రోజు వస్తుంది. అందుకే నువ్వు వెళ్లి మీ అమ్మ నాన్నలకి చెప్పెయ్యి పెళ్లి గిళ్ళి వద్దని. ఎందుకంటే నీకు అసలు పెళ్ళే అవసరం లేదు. ఇక సెక్స్ లాంటి అవసరాలంటావా ఈ కాలం లో అదొక పెద్ద విషయం కాదు.
నాకు తెలిసి ఈ మధ్య చాలామంది పెళ్లి చేసుకుంటున్నారంటే అందులో ముఖ్య కారణం సెక్స్ కూడా అయి ఉంటుంది కదా?

నేను: మన సమాజంలో సెక్స్ అనేది పెళ్లి తరవాతనే allowed కాబట్టి పెళ్ళికి సెక్స్ అవసరాలకి సంబంధం ఎక్కువగానే ఉంటుంది. ఈ విషయం లో pre marital or no marital sex యొక్క moral acceptance అనేది మనిషి ఎలా కండిషన్ చేయబడ్డాడు అనే దాని మీద ఆధార పది ఉంటుంది. ఒకటి సోషల్ కండిషనింగ్. which says its bad. the second is your own moral values, you think that i should or should not do this no matter what the society says. ఇవన్నీ కాక మూడోది animal instinct. అంటే opposite sex మీద కారణం లేకుండానే కోరిక కలగటం. అలాంటి కోరికలు నాకు ఎప్పుడు కలగలేదు అని చెప్పే వాళ్ళు తమను తాము మోసం చేసుకుంటున్నట్టే లెక్క. ఒక సారి కాకపొఇనా మరొకసారైనా, ఒక వ్యక్తి పై కాకపోఇనా మరో వ్యక్తి పై కలిగే ఆలోచన మనిషి జంతువు గా ఉన్నప్పటి నుంచి ఉంటూ వస్తున్న ఎమోషన్. సభ్య సమాజం లో మనిషి జీవించడం మొదలు పెట్టిన తరవాత ఈ ఎమోషన్ పూర్తిగా సప్రెస్ చేయబడింది. కాని అప్పుడప్పుడు అది బయటపడుతూ ఉంటుంది. అలా బయట పడటం ఇద్దరు వ్యక్తులకు ఒకే సారి జరిగితే కొన్ని నాన్ మ్యారేజ్ రిలేషన్ షిప్స్ కి దారి తీస్తుంది. అలా కాకుండా ఎవరికో ఒకరికే కలిగితే ఒక చెంప దెబ్బ తో ముగిసిపోతుంది.

రవి: ఇవన్నీ ఆలోచిస్తావు కాబట్టే నీకు ఏదీ తప్పు అనిపించదు. కానీ అలా ఆలోచిస్తూ పొతే జీవితం లో థ్రిల్ ఏముంటుంది. నువ్వు ఒక పని చెయ్ ఈ విషయాలన్నిటి మీద థీసిస్ రాసి అందరికి బోధించు. అది కూడా ఈ దేశంలో నే కాక దేశ విదేశాల్లో చెప్పవచ్చు.
నేను: ఈ విషయం నేను కనుక్కున్నది కాదు. ఈ మధ్యనే ఒక చోట చదివాను. ఈ విషయాలన్నీ వంద సంవత్సరాల కిందట KARL JUNG అనే ఒకాయన పరిశోధనలు చేసి అందరికి తెలియజేసాడు.
ఈ చదివి అర్థం చేసుకునే క్రమంలో ఒక విషయం గ్రహించాను. నేను ఏదైనా చదివితే ఒక్కోసారి వంద శాతం కన్విన్స్ అయ్యి చాలా ఇన్స్పైర్ అయిపోaతాను. అలా ఎందుకవుతున్నానా అంటే అంతవరకు నాలో అసంపూర్తిగా ఉన్న ఆలోచనలకి అక్కడ ఎవరో అక్షర రూపం ఇచ్చినట్టన్నమాట.

రవి: వాడెవరో చెప్పడం కాదు నువ్వు చెప్పు.
నేను: నేనొకటి చేయొచ్చు. ఆయన లాంటి వాళ్ళు చెప్పిన విషయాలను తెలుసుకుని వాటి మీద నేను ఏదైనా చెప్పగలనేమో చూస్తాను. అయిన్ స్టీన్ లాంటి గొప్ప సైంటిస్ట్ ఒకాయన ఇదే చెప్పాడు. నేను ఏదో కనిపెట్టానంటే అది నా ఒక్కడి ఎఫర్ట్ మాత్రమె కాదు. నాకంటే ముందు ఎందఱో తెలుసుకున్న విషయాల సహాయంతో నా ఈ ఇన్వెన్షన్ సాధ్యమయ్యింది అని. అలాగే నేను ఏదైనా కనుక్కున్నాకనుక్కోక పోఇనా ఈ ఆలోచనల్ని ముందుకు తీసుకుపోవడం మాత్రం నా బాధ్యత అవుతుంది.

రవి: హ్మ్మ్.

నేను: ఈ తలకాయ వాడి వాడి అలిసి పోయాను అందుకే ఇంక అసలు వాడకూడదని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఈ మెంటల్ స్టేట్ లో ప్రేమ అనే విషయం ఆలోచించాలంటే బ్రెయిన్ ని పక్కనపెట్టాలి. అప్పుడే నేనొక మిరాకిల్ జరుగుతుందని నమ్మగలను.

రవి: ప్రేమ అనేది ఒక బాధ్యతా అనుకుంటున్నావా లేక అది లేకుండా నువ్వు ఉండలేవా?

నేను: అదే నాకు పూర్తిగా అర్థం కావడం లేదు .

రవి: నీకు తెలుసా నీ బిహేవియర్ వలన నీతో బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళు ఎంతో హర్ట్ అయి ఉంటారని. వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు కాని నేను చాల బాధపడిన సందర్భాలున్నాయి.

నేను: నువ్వే కాదు నేను చాలా మందిని బాధపెట్టాను. అందుకే వీటన్నిటికి దూరంగా వెళ్లిపోవాలనిపిస్తుంది.

రవి: నువ్వు అలా ఉండిపోవడమే మంచిది. లేదూ పెళ్లి చేసుకోవాలనే అనుకుంటే ఇవన్ని పక్కన పెట్టినప్పుడే సాధ్యమవుతుంది.

నేను: ఒక్కో సారి అనిపిస్తుంది అరెంజ్డ్ marriage చేసుకున్న వాళ్ళు అసలు ఏమి బాధ్యత ఫీల్ కానవసరం లేదు కదా. నువ్వు elaagaina

...

...

.ఇంకా ఉంది. ఇప్పటికి ఇంతే టైపు చేయగలిగాను.

No comments:

Post a Comment